కరోనా వైరస్ వల్ల చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాలసుబ్రహ్మణ్యం కాస్త కోలుకున్నాడని ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ వీడియో ద్వారా తెలిపారు. తన తండ్రి బాలు చికిత్సకు సహకరిస్తున్నాడని, ఎన్నో లక్షల, వేల అభిమానుల అభిలాష, ప్రార్థనలు ఫలిస్తున్నాయని అలాగే వైద్యులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
వెంటిలేటర్, ఎక్మో పరిరకంతో చికిత్సలు చేస్తున్నట్లు ఎంజీఎం వైద్య సర్వీసుల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధా భాస్కరన్ కుడా ఓ ప్రకటనలో తెలిపారు. గత 20 రోజులుగా బెడ్‌మీదనే పడుకొని ఉండడంతో ఆయనకు ఫిజియోథెరపీ కూడా చేస్తునన్నట్లు వివరించారు. బాలసుబ్రహ్మణ్యం అవయవాలు అన్నీ బాగానే పనిచేస్తున్నాయని, శ్వాస తీసుకోవడం కాస్త మెరుగైందన్నారు.
వరుడు ముందే వధువుకు ముద్దుపెట్టిన ప్రియుడు
ఇదిలావుండగా బాలు చికిత్స పొందుతున్న ఐసియూ రూమ్‌లో హనుమాన్ చాలీసా, విష్ణుసహస్రనామం వినిపిస్తున్నారు. వేద పండితులు రోజు వచ్చి దిగువ అంతస్థులో వేదపారాయణం చేస్తున్నారు. అయితే గదిలో వినిపిస్తున్న సంగీతానికి బాలు స్పందిస్తున్నారని తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు.