end
=
Thursday, May 16, 2024
ఫీచ‌ర్స్ ‌వంటలుసండే స్పెషల్ బిర్యానీ
- Advertisment -

సండే స్పెషల్ బిర్యానీ

- Advertisment -
- Advertisment -

ఆదివారం వచ్చింది అంటే ఎదో ఒక స్పెషల్ చేసుకోవాలాని తినాలని ఉంటుంది కదా. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో తెల్సుకుందాం. బయట రూ.100 పెడితే బిర్యానీ వస్తుంది కానీ హోటల్ వాళ్ళు ఎ నూనె వాడరో ఎలా చేశారో కారం, ఉప్పు ఎలా ఉంటుందో అనే సందేహం ఉంటుంది కదా అందుకే మన ఇంట్లో మన రుచికి తగ్గట్టు గా ఎలా చేసుకోవచ్చో తెల్సుకుందాం.

(చదవండి : నోరూరించే చికెన్ బాల్స్)

కావలసిన పదార్థాలు:

చికెన్ – ఒక కేజీ, బాస్మతీ బియ్యం – ఒక కేజీ, ఉల్లిపాయలు – నాలుగు, పెరుగు – రెండు కప్పులు, అల్లం, వెల్లుల్లి ముద్ద – మూడు స్పూన్లు, కొత్తిమీర – కొద్దిగా, పుదీనా – కొద్దిగా, పచ్చిమిర్చి – ఐదు, చిటికెడు పసుపు – తగినంత కారం – రెండు స్పూన్లు, యలకులు – నాలుగు, లవంగాలు – కొద్దిగా , దాల్చిన చెక్క – చిన్న ముక్క, గరం మసాలా – రెండు స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – తగినంత.

ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా తరిగి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా మర్చిపోతే ఫ్లెవర్ మిస్ అవుతుంది. ఒక గిన్నె తీసుకొని చికెన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరం మసాలా వేసి బాగా ముక్కలకి పట్టేలా కలిపి కనీసం గంటసేపు నానబెట్టాలి. ఆ తర్వాత బియ్యం కడిగి పదినిమిషాలు నాననిస్తే చాలు. మందమైన గిన్నె తీసుకొని నూనె వేసి దానిలో నానబెట్టిన చికెన్, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి. ఒక స్టవ్ పైన చికెన్ ఉడుకుతున్నపుడు పక్కన స్టవ్ మీద రైస్ పెట్టుకోవాలి.ఇంకో పెద్ద గిన్నె తీసుకొని బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి అన్నానికి సరిపడా ఉప్పు వేసి మరిగించాలి.

(చదవండి : పనీర్ చీజ్ శాండ్‌విచ్..)

నీరు మరిగేటప్పుడు యలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు వెయ్యాలి. మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే గంజి వార్చి, తర్వాత సగం ఉడికిన అన్నంను మాంసంపై సమానంగా పరవాలి. ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమిర, పుదీనా కొద్దిగా, పాలలో కేసర్ రంగు బాగా కలిసేలా కలిపి వేసుకోవాలి. ఆ తరువాత దానిమీద మూత పెట్టాలి. పొయ్యిమీద ఇనప పెనం పెట్టి వేడిచేసి దానిపై ఈ గిన్నె పెట్టి దాని మీద బరువైన వస్తువు పెట్టాలి. దీనివల్ల అడుగు మాడకుండా, ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. దీనికి కాంబినేషన్‌గా పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఘుమఘుమల వాసన చూసి అదరహో అంటారంతే.

(చదవండి :మక్కలతో వడలు తయార్‌ )

ఒక్కసారి చేయగానే బాగా రాలేదని వదిలేయకుండా రెండు, మూడు సార్లు ట్రై చేస్తే బాగా వస్తుంది. మనకి తినాలి అనిపించప్పుడు లేదా పిల్లలు అడిగినప్పుడు హాయిగా ఇంట్లోనే యమ్మిగా ఇంట్లో చేసుకొని తినచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -