అక్రమంగా రవాణా చేస్తున్న బస్తాలకొద్ది అంబర్ పొగాకు/గుట్కా ప్యాకెట్లను పోలీసులు దాడులు నిర్వహించా పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు 9 లక్షల 50వేలు ఉంటుంది పోలీసుల అంచనా. వివరాల్లోకి వెళితే నిషేధించిన అంబర్ ప్యాకెట్లను ఖమ్మం నగరంలోని మున్సిపల్ రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకటరావు అండ్ పోలీస్ టీమ్ మెరుపుదాడులు నిర్వహించారు. నిందితుడు వాసుదేవరావును అదుపులోకి తీసుకొని అంబర్‌ప్యాకెట్ బస్తాలను సీజ్ చేశారు. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రఘు, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రామారావు, ఉపేందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదండి…