- హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
తెలంగాణలోని జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, అలాగే ఉపరితల ఆవర్తనం కొనసాగడం వల్ల హైదరాబాద్‌తో సహా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, రాజనన్నసిరిసిల్ల, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్, ములుగు, సూర్యపేట తదితర జిల్లాలలో భారీ వర్షం పడింది. అయితే రాబోయే రెండు రోజులు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Also Read…