end
=
Wednesday, October 29, 2025
రాజకీయంరిజర్వేషన్ల సాధనలో ఇది కీలక మలుపు: మహేశ్ కుమార్ గౌడ్
- Advertisment -

రిజర్వేషన్ల సాధనలో ఇది కీలక మలుపు: మహేశ్ కుమార్ గౌడ్

- Advertisment -
- Advertisment -

Mahesh Kumar Goud : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు(BC) స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల(42 percent reservations) సాధన కోసం బీసీ సంఘాలు ప్రారంభించిన బీసీ బంద్‌(BC Bandh) రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి, బంద్‌కు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అనంతరం అంబర్‌పేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీ బంద్‌కి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. నేడు ఈ ఉద్యమంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్న విషయం గర్వకారణం. ఉదయం నుంచే బంద్‌ పరిస్థితులను స్వయంగా మానిటర్ చేస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి, రవాణా స్తంభించింది. ఇది బీసీల ఆకాంక్షలకు పెద్ద పుష్కరం అని పేర్కొన్నారు.

బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఇతర పార్టీలకు లేదని స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. మేము రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన నిర్వహించి, దాని ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లకు జీవో జారీ చేశాం. అయితే ఆ జీవోపై దురదృష్టవశాత్తు స్టే వచ్చినా, మా కృషి ఆగదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి. ఈ విషయంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసి విజ్ఞప్తి చేస్తాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయమై మాట్లాడిన ఆయన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఎన్నికలు ఈ కోణంలోనే జరుగాలని చూస్తున్నాం. సాధ్యాసాధ్యాలను పూర్తిగా విశ్లేషించిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు. బీసీల న్యాయమైన హక్కులను సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బంద్‌లో పాల్గొంటున్న తీరును ఆయన అభినందించారు. ప్రజలు ఇచ్చిన మద్దతే ఈ ఉద్యమానికి బలమని, రిజర్వేషన్ల సాధనలో ఇది కీలక మలుపు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -