end
=
Monday, January 26, 2026
వార్తలురాష్ట్రీయంఅమరావతిని దేవతల రాజధానిలా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
- Advertisment -

అమరావతిని దేవతల రాజధానిలా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

- Advertisment -
- Advertisment -

Chandrababu: అమరావతి(Amaravati)ని దేవతల రాజధానిని తలపించేలా అభివృద్ధి చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతి నిర్మాణం (Amaravati construction )కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన ఉదారతను ఆయన గుర్తుచేసారు. రాజధాని పవిత్ర కార్యక్రమాలకు రైతులు చూపిన సహకారం ప్రశంసనీయమని అభినందించారు. గురువారం అమరావతి వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ(Amaravati construction)కు సీఎం చంద్రబాబు భూమిపూజ ( Bhumi Puja) నిర్వహించారు. ఈ ఆలయ అభివృద్ధి పనులను రెండు దశల్లో చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో ఆలయ ప్రదేశం మరింత వైభవవంతంగా మారనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మొదటి దశలో రూ.140 కోట్లతో ఆలయ పరిసర అభివృద్ధి పనులు చేపడతారు. ఇందులో ముఖ్యంగా రూ.92 కోట్ల వ్యయంతో ఆలయాన్ని చుట్టూ ప్రశస్తమైన ప్రాకారాన్ని నిర్మించనున్నారు. అదేవిధంగా రూ.48 కోట్లతో ఏడు అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం వంటి నిర్మాణాలు తీసుకొస్తారు. పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ వంటి పనులు కూడా ఈ దశలోనే పూర్తవుతాయి. ఈ అభివృద్ధి పూర్తయ్యే సరికి ఆలయ సౌందర్యం మరింత పెరిగి, భక్తుల రద్దీకి తగిన వసతులు సిద్ధమవుతాయని అధికారులు తెలుపుతున్నారు. రెండో దశలో రూ.120 కోట్లతో మరిన్ని విస్తృత పనులు చేపట్టడం జరుగుతుంది. శ్రీవారి ఆలయ మాడ వీధుల నిర్మాణం, అప్రోచ్ రోడ్ల విస్తరణ, అన్నదాన కాంప్లెక్స్ ఏర్పాట్లు, యాత్రికుల కోసం విశ్రాంతి భవనాలు, అర్చకులు మరియు సిబ్బంది కోసం క్వార్టర్స్ నిర్మాణం వంటి కీలక పనులు పూర్తి చేయనున్నారు.

అదనంగా రెస్ట్ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి ముఖ్య సదుపాయాలు ఈ దశలో రూపుదిద్దుకుంటాయి. భవిష్యత్తులో అమరావతి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందేందుకు ఇవి కీలక మౌలిక వసతులుగా నిలుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం శ్రీవారి ఆలయ అభివృద్ధికి రూ.185 కోట్ల ప్రణాళిక రూపొందించగా, 2019లో వైకాపా ప్రభుత్వం దానిని రూ.36 కోట్లకు తగ్గించింది. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేసింది. గత ప్రణాళికలను మించి శ్రీవారి ఆలయాన్ని అపూర్వ ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేందుకు చర్యలు ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి అమరావతి నిజంగానే దేవతల రాజధానిని తలపించేలా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -