end
=
Tuesday, July 1, 2025
వార్తలురాష్ట్రీయం30 లోపు నివేదిక ఇస్తాం: సీఎంవో
- Advertisment -

30 లోపు నివేదిక ఇస్తాం: సీఎంవో

- Advertisment -
- Advertisment -

పీసీ ఘోష్ కమిషన్ లేఖకు సమాధానం

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project)కు సంబంధించిన కేబినెట్ అంశాలు కావాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ (Justice Pinaki Chandraghosh Commission) ఇటీవల సీఎంవో (TG CMO)కు లేఖ రాసింది. ఆ లేఖకు సీఎంవో సమాధానమిస్తూ ఈనెల 30వ తేదీ లోపు ఆయా శాఖలు తగిన సమాచారం ఇస్తాయని పేర్కొన్నది.

ముఖ్యంగా ఇరిగేషన్, ఆర్థికశాఖ (Irrigatation and Financial Depts) నుంచి కీలక సమాచారం వస్తుందని తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బరాజ్‌ల నిర్మాణంపై ఇప్పటికే కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగించిన సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్ కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పరిధిలోని కొన్ని లోపాలు వెలుగు చూశాయి.

నిర్మాణంలో అవకవతవకలను తేల్చేందుకు రాష్ట్రప్రభుత్వం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌ను చైర్మన్‌గా కొంత సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ దీనిలో భాగంగానే నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లు, మాజీ మంత్రులకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది.

కమిషన్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుండగా, ఆ లోగానే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -