‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Goutam Tinnanuri) దర్శకత్వంలో రానున్న తదుపరి చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom Movie). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ (Producer Naga Vamshi) నిర్మిస్తున్న సినిమా ఇది. సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో (Pan Indian Movie)విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా భారీ బడ్జెట్ (Heavy Budget Film)తో రూపొందిన ఈ చిత్రం టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టిప్లెక్సుల్లో రూ.75 అదనంగా పెంచుకునే వెసులుబాటు వచ్చింది. ఈ ధరలు సినిమా విడుదలైన జూలై 31వ తేదీ నుంచి 10 రోజుల పాటు అమలులో ఉంటాయి.
కానీ, అక్కడి ప్రభుత్వం స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వనట్టు తెలుస్తోంది. తెలంగాణలో మాత్రం చారిత్రక విశేషాలతో తెరకెక్కిన చిత్రాలకు తప్ప, ఏ సినిమాలకూ టికెట్ ధరలు పెంచేది లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. శనివారం తిరుపతిలో, 28వ తేదీన హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనున్నది.