టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని నటి పూజా హెగ్డే అన్నారు. ఎన్టీఆర్-పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘అరవింద సమేత’. ఈ సినిమాలో అరవిందగా పూజా నటించగా.. వీర రాఘవగా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. తెరపై వీరి జంట చూడముచ్చటగా ఉంటుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ కేరీర్‌లోనే టాప్ గ్రాసర్ సినిమాగా నిలిచింది.
కాగా, ఈ సినిమాకు సంబంధించిన అనుభూతుల్ని నటి పూజా హెగ్డే మీడియాతో పంచుకున్నారు. అరవింద సమేత తన కేరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకమైన మూవీగా నిలిచిపోతుందని తెలిపారు. ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ సూపర్ అని పూజ ప్రశంసించింది. తమ ఇద్దరి జోడీ ఆన్‌స్ర్కీన్‌పై చూడముచ్చటగా ఉందని ఆమె మురిసిపోతూ అన్నారు. ఆఫ్ స్ర్కీన్ లో కూడా తమ మధ్య మంచి స్నేహ బంధముందన్నారు పూజా హెగ్డే. త్రివిక్రమ్ సార్ వల్ల ఈ సినిమాలో డబ్బింగ్ కూడా చెప్పానన్నారు. కాగా, పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోంది.