- ప్రేమ విషయం ఇండ్లలో తెలిసిందని భయపడి పురుగులమందు తాగిన ప్రేమజంట
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో విషాధం చోటుచేసుకుంది. ప్రేమికులు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతోఇరు కుటుంబీకులు శోకసముద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే మల్‌రెడ్డిపల్లికి చెందిన బాలరాజ్(22), అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక (16) గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం కాస్త వారి ఇండ్లలో తెలిసింది. దీంతో ప్రేమజంట వారి వివాహానికి పెద్దలు ఒప్పుకోరేమోనని భయపడి పురుగుల మందు తాగారు. మైనర్ బాలిక అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స నిమిత్తం బాలరాజ్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. తెలిసితెలియని వయసులో, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల రెండు నిండు ప్రాణాలు కోల్పోయారు.