end
=
Tuesday, October 14, 2025
వార్తలురాష్ట్రీయం2027 నాటికి ఏఐ పౌర సేవలు
- Advertisment -

2027 నాటికి ఏఐ పౌర సేవలు

- Advertisment -
- Advertisment -

తెలంగాణలో పౌరుల(Telanagana State)కు మెరుగైన సేవలు(Better Services) అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)కృత్రిమ మేధస్సు (Artificial Intellegence)ను వినియోగించనుంది. 2027 నాటికి రాష్ట్రంలో కోటి మంది పౌరులకు AI ఆధారిత సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి(IT Minister) దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar babu) వెల్లడించారు.

హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌లో ‘ఏఐ లెడ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చాంపియన్స్ అండ్ క్యాటలిస్ట్స్ ప్రోగ్రామ్’ పేరుతో ప్రభుత్వ అధికారులకు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. తమది ప్రజలు అడగకుండానే వారికి మెరుగైన పౌర సేవలను అందించే చురుకైన, పారదర్శకమైన ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రం 5 బిలియన్ డాలర్ల AI ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారుతుందని,

వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆకాంక్షించారు. ‘ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు AI సిటీ, AI యూనివర్సిటీ, తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని హామీ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా AI ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని మంత్రి తెలిపారు. ఇదే స్ఫూర్తితో 20 ప్రభుత్వ శాఖలకు చెందిన 300 రకాల పౌర సేవలను

AI ఆధారిత ప్లాట్‌ఫామ్‌పై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా, 250 మంది అధికారులను ఎంపిక చేసి, మూడు నెలలపాటు AI వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ సంజయ్‌కుమార్, డిప్యూటీ సెక్రటరీ భవేశ్‌మిశ్రా పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -