end
=
Saturday, January 24, 2026
వార్తలుపర్యాటకులకు గుడ్‌ న్యూస్‌.. కైలాసగిరిపై గ్లాస్‌ బ్రిడ్జి ఆవిష్కరణ
- Advertisment -

పర్యాటకులకు గుడ్‌ న్యూస్‌.. కైలాసగిరిపై గ్లాస్‌ బ్రిడ్జి ఆవిష్కరణ

- Advertisment -
- Advertisment -

Visakhapatnam: విశాఖపట్నంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన(Popular tourist destination) కైలాసగిరిపై నిర్మించిన అద్భుత సాంకేతిక సౌందర్యం గల గ్లాస్‌ బ్రిడ్జి (Glass Bridge)ఇప్పుడు సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ ప్రాజెక్టును ఎంపీ శ్రీభరత్‌, మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ మాట్లాడుతూ..విశాఖను పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఈ దిశగా వీఎంఆర్డీఏ అనేక వినూత్న పర్యాటక ప్రాజెక్టులు అమలు చేస్తోందని తెలిపారు. కైలాసగిరి ఇప్పటికే నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని, ఇప్పుడు గ్లాస్‌ బ్రిడ్జి చేరికతో ఇక్కడ పర్యాటకుల రాకపోకలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈ గ్లాస్‌ బ్రిడ్జిని ప్రత్యేక సాంకేతికతతో రూపుదిద్దినట్టు ఆయన వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా ఈ బ్రిడ్జి డిజైన్‌ చేయబడింది. త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టును కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం అని ప్రణవ్‌గోపాల్‌ తెలిపారు.

ఈ బ్రిడ్జి నిర్మాణంలో 40 ఎంఎం మందం గల అత్యుత్తమ నాణ్యత కలిగిన ల్యామినేటెడ్‌ గాజును వినియోగించారు. దీనిని ప్రత్యేకంగా జర్మనీ నుండి దిగుమతి చేసినట్టు అధికారులు వెల్లడించారు. భద్రత పరంగా కూడా ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒకేసారి 500 టన్నుల వరకు బరువును మోయగల సామర్థ్యంతో పాటు గంటకు 250 కి.మీ. వేగంతో వీచే తీవ్రమైన గాలులను కూడా తట్టుకునేలా దీన్ని రూపొందించారు. సందర్శకుల కోసం బ్రిడ్జిపై ఒకేసారి 40 మందికి పైగా ప్రవేశం కల్పించారు. పర్యాటకులు ఈ బ్రిడ్జిపై నిలబడి కైలాసగిరి పరిసరాల్లోని సముద్ర సౌందర్యాన్ని, నగర గోచరాలను, పచ్చని ప్రకృతి దృశ్యాలను మరింత అద్భుతంగా వీక్షించే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆధునిక పర్యాటక సదుపాయాలు విశాఖపట్నం పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపునిచ్చేలా ఉండనున్నాయి. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ పర్యాటక నక్షత్రంలో నిలబెట్టే దిశగా వీఎంఆర్డీఏ చేపడుతున్న ఈ తరహా ప్రాజెక్టులు నగరవాసులు, పర్యాటకులు ప్రశంసిస్తున్నాయి. గ్లాస్‌ బ్రిడ్జి ప్రారంభంతో కైలాసగిరి మరోసారి పర్యాటకుల హాట్‌స్పాట్‌గా మారింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -