Hyderabad : హైదరాబాద్ బులియన్ మార్కెట్(Bullion market)లో బంగారం, వెండి ధరలు (Gold and silver prices)వరుసరోజులుగా పెరుగుతూ పెట్టుబడిదారులకు, ఆభరణాల కొనుగోలుదారులకు భారం పెంచుతున్నాయి. ఈ వారంలో కూడా ధరకల్లో పెరుగుదల కొనసాగుతూనే ఉండగా, ముఖ్యంగా పసిడి రేట్లలో కనిపించిన పెద్ద ఎగబాకుడు మార్కెట్ దృష్టిని ఆకర్షించింది. ఈరోజు ఉదయం ట్రేడింగ్ సెషన్ ప్రకారం, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.660 పెరిగి రూ.1,30,480కు చేరుకుంది. అంతకు ముందురోజు స్థాయితో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ప్రపంచ మార్కెట్లలో డాలర్ బలహీనత, క్రూడ్ ధరల్లో ఉన్న అస్థిరత, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ సంకేతాలు పెరగడం వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడిదారులు మళ్లీ పసిడిపై ఆసక్తి చూపుతుండటం కూడా రేటు ఎగబాకడానికి కారణంగా చెప్పబడుతోంది. ఇక, 22 క్యారెట్ల బంగారం కూడా అదే ఊపును కొనసాగిస్తోంది. 10 గ్రాముల ధర రూ.600 పెరిగి ప్రస్తుతం రూ.1,19,600 వద్ద ట్రేడ్ అవుతోంది. వివాహాలు, ఉత్సవాల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆభరణాల డిమాండ్ పెరగడం కూడా ఈ ధరల పెరుగుదలకు తోడ్పడిందని బంగారవ్యాపారులు చెబుతున్నారు.
ముఖ్యంగా రిటైల్ జ్యువెలరీ షాపుల్లో కస్టమర్ల రద్దీ పెరుగుతుండటం గమనించవచ్చు. వెండి ధరలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. కిలో వెండిపై రూ.4,000 మేర పెరిగి ప్రస్తుతానికి రూ.1,96,000కు చేరుకుంది. పరిశ్రమల్లో వెండికి విస్తృతంగా ఉపయోగం ఉండటంతో పాటు, బులియన్‌గా కూడా మంచి డిమాండ్ ఉండటం ధరలను పైకి నెడుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ఫ్యూచర్స్‌లో కనిపించిన పెరుగుదల దేశీయ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇదే రేట్లు అమల్లో ఉన్నట్లు జ్యువెలర్స్ అసోసియేషన్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాలకు మాత్రమే కాకుండా, జిల్లాల మార్కెట్లలో కూడా పెద్ద తేడా లేకుండా ఇదే తరహా పెరుగుదల నమోదవుతోంది. మొత్తం గా, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మళ్లీ అస్థిరంగా మారుతున్న సమయంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు పెట్టుబడిదారులకు సురక్షిత ఆస్తులుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా రాబోయే రోజుల్లో కూడా ధరకల్లో చలనం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
