end
=
Wednesday, May 15, 2024
రాజకీయంAndhra Pradesh Assembly Session:మూడు రాజధానులు
- Advertisment -

Andhra Pradesh Assembly Session:మూడు రాజధానులు

- Advertisment -
- Advertisment -

ఏపీ సమావేశాలకు సిద్ధమైన అసెంబ్లీ(AP Assembly). ఈరోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ మొదలుకానున్నది. ఎన్నో ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్నిరోజులు, ఏయే అంశాలు చర్చించాలో బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు శాసనసభ(Legislature)లో పరిపాలనా వికేంద్రీకరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిపాలనా వికేంద్రీకరణపై సీఎం వైఎస్ జగన్(YS Jagan) కీలక ప్రసంగం చేయనున్నట్లు సమాచారం. 

ఈ అసెంబ్లీ సమావేశాల ల్లో మొదట మూడు రాజధానుల(3 Capitals) అంశంపై ప్రత్యేకంగా చర్చ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌(Powerpoint Presentation) ద్వారా అందరికీ వివరించనున్నారు. దీనిపై ఆయన రాజకీయంగా ముఖ్య ప్రకటననూ చేసే అవకాశం లేకపోలేదని సమాచారం. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తం 25 అంశాలపై చర్చించాలని అధికార పక్షం ప్రతిపాదనాలతో రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

ఈసారి సమావేశాల్లో 4 బిల్లులను ప్రవేశపెట్టాలని ఎదురుచూస్తున్న రెవెన్యూశాఖ(Department of Revenue). 3 బిల్లులు చట్ట సవరణకు, ఒక బిల్లు రద్దుకు సంబంధించినవి. భూముల రీ-సర్వే జరిపిన తర్వాత యజమానులకు శాశ్వతంగా భూ యాజమాన్య హక్కు కల్పించేందుకు టైటిలింగ్‌ యాక్టు(Titling Act) సవరణ తీసుకురాబోతున్నారు. ఈ బిల్లును సభలో మూడోసారి పెట్టి ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నారు. దీనికి చట్టసభల్లో ఆమోదం తెలిపిన తర్వాత ఆమోదం కోసం కేంద్ర హోంశాఖ దృష్టి కి తెనున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -