- రాఘవేంద్ర లాడ్జీపై పోలీసుల దాడులు
- సినీ ఆర్టిస్టులతోపాటు నలుగు విటులు రిమాండ్
హైదరాబాద్‌ః సినీమా జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు లాడ్జీపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి, షాపూర్‌లో రాఘవేంద్ర లాడ్జీలో జరిగింది.
అడిషనల్ ఎస్పీని బలితీసుకున్న కరోనా వైరస్
గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సినీమా జూనియర్ ఆర్టిస్టులతో సత్యనారాయణ అలియాస్ రాజేష్ అనే వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆ లాడ్జీపై దాడులు నిర్వహించారు.
27 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం
ఈ దాడులలో విటులు దనం సంపత్, ఓబిలాష్, నర్రా రాజ్‌కుమార్, సురేష్ అనే వ్యక్తులు ఉండగా, నలుగురు మహిళలు యెడిగంటి ఆమన్, రాధా, షేక్ సానియా, షభానాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో షేక్ హసీనా, షేక్ షభానాలు సినీ జూనియర్ ఆర్టిస్టులు కాగా, విటులు నర్రా రాజ్‌కుమార్ ప్రభుత్వ వీఆర్వో. వీరందరిపై వ్యభిచార చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.