end
=
Thursday, May 16, 2024
వార్తలురాష్ట్రీయంCM KCR : సీనియర్‌ జర్నలిస్టు లక్ష్మారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం
- Advertisment -

CM KCR : సీనియర్‌ జర్నలిస్టు లక్ష్మారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

- Advertisment -
- Advertisment -

Journlist LakshmaReddy : ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి(92) అనారోగ్య సమస్యలతో గురువారం తెల్లవారుజామున మృతి(Died) చెందారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana CM KCR) తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన పత్రికా రంగానికి చేసిన సేవలు (Journalism Service) గుర్తు చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన లక్ష్మారెడ్డి చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారని సీఎం కేసీఆర్‌ అన్నారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని(Condolences) తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.15లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.\

Journalist kancharla Lakshmareddy

నల్లగొండ జిల్లా పరసాయపల్లెకు చెందిన కె.ఎల్‌.రెడ్డి (K.L.Reddy) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లక్ష్మారెడ్డి 1950లో ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) నుండి డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం తెలుగుదేశం (Telugudesam Party) రాజకీయ వారపత్రికలో సుదీర్ఘ కాలం పాటు జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం కాలేజీ విద్యార్థి పేరుతో మాసపత్రిక, తెలంగాణ ప్రభ పేరుతో వారపత్రికలను లక్ష్మారెడ్డి స్వయంగా నడిపారు. అలాగే తెలంగాణ ఉద్యమం (1969) సమయంలో ‘నేడు’ అనే కరపత్రాన్ని మూడు నెలలపాటు వెలువరించారు.

(Women’s freedom: స్త్రీ స్వేచ్ఛ కోసం మేల్ రైట్స్ విస్మరించవచ్చా?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -