end
=
Tuesday, May 21, 2024
వార్తలుజాతీయంపంజా విసురుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌
- Advertisment -

పంజా విసురుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌

- Advertisment -
- Advertisment -
  • దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు
  • ఒక్క రోజులోనే 24వేల పాజిటివ్‌ కేసులు
  • భయాందోళనలో ప్రజలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తుంది. భారతదేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించిన రిపోర్టును విడుదల చేసింది. వారం రోజుల్లోనే దేశంలో లక్షకు పైగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో దేశంలో ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం నుండి కరోనా వైరస్‌ ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది.

గత కొన్ని నెలల క్రితమే కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పటికీ మళ్లీ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ప్రజలపై చూపుతోంది. దశల వారిగా దేశంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేసి ప్రజల జీవనాన్ని మళ్లీ మెరుగు పరిచే ప్రక్రియలో ఉండగా మహమ్మారి కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌తో మళ్లీ వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం, ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే అన్ని పాఠశాలలు, కళాశాలలు, హోటళ్లు, సినీమా హాళ్లు, ఇతరత్రా పరిశ్రమలు తెరుచుకొని చిన్న చిన్నగా వ్యాపారాలు ప్రారంభించారు. అలాగే విద్యార్థుల చదువులు మళ్లీ ఒక గాడిలో పడ్డాయి. కానీ ఈ భయంకరమైన వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో భవిష్యత్తుపై ఆందోళన, భయం పెరిగిపోతుంది.

ఇప్పటి వరకు దేశంలో కోటి 9 లక్షల కేసులు నమోదయ్యాయి. అలాగే 2 లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు రికార్డు అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 24,882 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య కోటి 13 లక్షల 33 వేల 728కి చేరింది. అదేవిధాగా 19,957 మంది వ్యాధి నుండి కోలుకోగా, 1,09,73,260 మంది డిశ్చార్జి అయ్యారు. 140 మంది కరోనా వైరస్‌ వల్ల మరణించారు. మొత్తం 2,02,022 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 9.82 శాతం, యాక్టివ్‌ కేసులు 1.78 శాతం, మరణాలు 1.40 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -