end
=
Sunday, November 9, 2025
వార్తలురాష్ట్రీయంవెంకన్న దేవాలయంలో సాలగ్రామ శోభ భక్తుల హర్షం..
- Advertisment -

వెంకన్న దేవాలయంలో సాలగ్రామ శోభ భక్తుల హర్షం..

- Advertisment -
- Advertisment -

Neredmet: ఆనంద్ బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం(Sri Lakshmi Venkateswara Swamy Temple) లో భగవంతుడి అనుగ్రహం మరోసారి ప్రతిపలించింది. నేపాల్ లోని గండకీ నది తీరాల నుండి లభించిన పవిత్ర సాలగ్రామ శిలను ఖాట్మండులో సాలగ్రామాన్ని పరీక్షింపజేసి నిర్ధారించి అనంతరం నేరేడ్మెట్ రామకృష్ణాపురానికి చెందిన శ్రీవారి భక్తుడు శ్రీనివాసులు శెట్టి స్వయంగా దేవాలయానికి సమర్పించడంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాదాపు రెండు సంవత్సరాలు ఈ సాలగ్రామాన్ని సంపాదించినందుకు కృషిచేసిన భక్తుడు ఇటీవల కాలంలో ఆ హిరణ్య గర్భ మహా నారాయణ సాలిగ్రామాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాదాపు రెండు సంవత్సరాలు ఈ సాలగ్రామాన్ని సంపాదించినందుకు కృషిచేసిన భక్తుడు ఇటీవల కాలంలో ఆ హిరణ్య గర్భ మహా నారాయణ సాలిగ్రామాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు ముడుంబై వెంకట రమణాచార్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకుడు ముడుంబై వెంకట రమణాచార్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి సాలగ్రామాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అత్యంత పవిత్రంగా ఏర్పాటు చేశారు.

ప్రతిరోజు అద్భుత అలంకరణ

ప్రతిరోజు సాలగ్రామాన్ని విశిష్ట పుష్పాలతో తులసి దళాలతో నూతన వేషాలతో అర్చకులు సొభగులు అద్దుతున్నారు. ఈ సుందర అలంకరణ చిత్రాలను అర్చకుడు భక్తులకు వాట్స్అప్ ద్వారా పంపుతూ సాలగ్రామ దర్శనాన్ని అందరికీ అందిస్తున్నారు. ఈ సేవను భక్తులు ఎంతో ఆశయంతో స్వాగతిస్తూ స్వామివారి దర్శనం ప్రతిరోజు లభిస్తుందంటే ఇదే మన అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అంతేకాకుండా సాలగ్రామం వాసం ఉన్నచోట లక్ష్మీనారాయణ ఆరాధన కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు మన ఆనంద్ బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా మారింది.

అర్చకుడికి భక్తులు ధన్యవాదాలు

పవిత్ర సాలగ్రామ శిలను స్వీకరించి శ్రీవారికి ప్రతిరోజు పూజ నిర్వహిస్తున్న ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులకు భక్తులు ధన్యవాదాలు చెబుతున్నారు ఈ సాలగ్రామం ఆలయంలో ఏర్పాటు చేయడంతో దేవాలయానికి దైవ శక్తి మరింత పెరిగింది అనిపూజ నిర్వహిస్తున్న ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులకు భక్తులు ధన్యవాదాలు చెబుతున్నారు ఈ సాలగ్రామం ఆలయంలో ఏర్పాటు చేయడంతో దేవాలయానికి దైవ శక్తి మరింత పెరిగింది అని భావోద్వేగంగా పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -