end
=
Sunday, November 23, 2025
వార్తలురాష్ట్రీయంరాష్ట్ర స్థాయి టైపింగ్ హయ్యర్ పరీక్షలో సహస్రకు 3వ ర్యాంక్
- Advertisment -

రాష్ట్ర స్థాయి టైపింగ్ హయ్యర్ పరీక్షలో సహస్రకు 3వ ర్యాంక్

- Advertisment -
- Advertisment -

Hyderabad : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం (Intermediate second year)చదువుతున్న విద్యార్థిని శ్రీ భాష్యం సహస్ర (Sri Bhashyam Sahasra)రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. తెలంగాణ టెక్నికల్‌ బోర్డు నిర్వహించిన ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌ హయ్యర్‌ పరీక్షలో ఆమె 3వ ర్యాంక్‌ను సాధించింది. గౌతమ్‌ టైప్‌రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఉప్పుగూడ)లో తర్ఫీదు పొందిన సహస్ర, జూలై 2025లో నిర్వహించిన ఈ పరీక్షలో అత్యుత్తమ నైపుణ్యంతో మెరిసింది.

ఇన్‌స్టిట్యూట్‌ ప్రిన్సిపాల్‌ అరుణ్‌ మాట్లాడుతూ..మా విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో ర్యాంక్‌ సాధించడం గర్వకారణం. సహస్ర భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం అని తెలిపారు. విద్యార్థిని ప్రతిభను అభినందిస్తూ ఆమెకు కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -