end
=
Friday, May 17, 2024
వార్తలురాష్ట్రీయంHeavy Rains : హైదరాబాద్‌లో ఈదురు గాలులు, భారీ వర్షం
- Advertisment -

Heavy Rains : హైదరాబాద్‌లో ఈదురు గాలులు, భారీ వర్షం

- Advertisment -
- Advertisment -

Heavy Rains : హైదరాబాద్‌లో ఉరుములు(Thunders), మెరుపులతో కూడిన భారీ వర్షం(Heavy Rains) పడుతోంది. తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh) రాష్ట్రాలలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ(Meterology) తెలిపింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలు ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురు గాలులు వీచాయి. భారీ వర్షం కురుస్తోంది. పశ్చిమ విదర్భ నుండి మరఠ్వాడా(Maratwada), కర్ణాటక(Karnataka) మీదుగా ద్రోణి అనిశ్చితి కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈదురు గాలులకు చాలా చోట్ల విద్యుత్‌ (Power Supply)అంతరాయం ఏర్పడింది. చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్లన్నీ వర్షపునీటితో(Rain Water) చెరువులను తలపిస్తున్నాయి. కాలనీల్లో వర్షపునీరు చేరడంతో చాలా చోట్ల ఇండ్లలోకి నీరు చేరుకుంది.

ఇక సోమవారం రోజు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ (Hyderabad Traffic Jam) ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఉప్పల్‌ (Uppal) మొదలుకొని హబ్సీగూడ(Habsiguda), తార్నాక(Tarnaka), మెట్టుగూడ(Mettuguda), ఆలుగడ్డబాయి(Alugadda Bavi), సంగీత్‌(Sangeeth), ప్యాట్నీ(Patney), పారాడైజ్‌, రసూల్‌పుర(RasoolPura), బేగంపేట, పంజాగుట్ట (Punjagutta) ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌ చాలా ఇబ్బందికరంగా మారింది.

ద్విచక్రవాహనదారులు మెట్రో రైల్‌ ట్రాక్‌ పిల్లర్ల వద్ద ఆగుతున్నారు. రెండు రోజుల కింద్ర 6 ఏళ్ల అమ్మాయి నాలాలో పడి మృతి చెందిన విషాధకర సంఘటన అందిరిని కలిచివేసింది. ముఖ్యంగా పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -