end
=
Friday, May 17, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Hug: ఒక్క కౌగిలింతతో అన్నీ దూరం
- Advertisment -

Hug: ఒక్క కౌగిలింతతో అన్నీ దూరం

- Advertisment -
- Advertisment -

కౌగిలింత..భాషకి అందని తియ్యని అనుభూతి. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ఆత్మీయ కౌగిలితో తెలియపరచవచ్చు. మీరు ఆరోగ్యంగా మరియు ఫిట్(Fitness) గా ఉండాలంటే సెక్స్,ముద్దు(Kiss),ఆలింగనం చేసుకోవటం అనేవి మీ జీవితంలో జరగాల్సిన విషయాలు. గుండెను ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. మీ జీవక్రియ(Metabolism)ను నిర్మిస్తుంది. మీకు మంచి నిద్రను ఇస్తుంది. హగ్గింగ్(Hugging) అనేది మానసిక ఆరోగ్యానన్ని పెంచుతుంది.ఈ రోజుల్లో చాలా మంది రోజంతా ఆఫీసు లో బిజీ బిజీ గా పనిచేస్తూనే ఉంటారు. ఇంటికి వచ్చే సమయానికి చాలా అలసిపోయి వస్తారు కదా అలాంటి టైమ్ లో మీ భర్త కి ఒక హుగ్ ఇచ్చి చూడండి మీకే అర్దం అవుతుంది. అప్పుడు వాళ్ళు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు అది మీరు గమనించవచ్చు. మానసిక, శారీరక ఒత్తిడిలు అన్నీ కూడా ఒక్క కౌగిలింతతో దూరం అవుతాయని చెబుతున్నారు.

 (ముద్దు పెడితే ఎన్ని లాభాలో..)

ఇంకో ముఖ్య విషయం ఏంటంటే భార్య భర్తలు కౌగిలించు కోవడం వల్ల దంపతులు ఎక్కువ కాలం ఆనందం గా ఉండచ్చు అని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా ఎంతో యవ్వనంగా ఉండచ్చు. కాబట్టి భార్య భర్తలు రోజుకు ఒకసారైనా తమ పార్టనర్‌ని ప్రేమతో హగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. కౌగిలించుకున్నప్పుడు మనలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్(Serotonin) అనే రసాయనాలు విడుదలవుతాయి. ఇలా చేయడం వల్ల బాడీ పెయిన్స్, నొప్పులు కూడా దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా మనం ఎవరైనా కౌగిలించుకున్నప్పుడు మనలోని థైమస్ గ్రంథి(Thymus Gland) ఉత్తేజానికి గురవుతుందట. దీంతో మన శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతంది. మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి(Memory Power) కూడా పెరుగుతుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -