end
=
Wednesday, May 15, 2024
వార్తలురాష్ట్రీయంKl Rahul-Athiya Wedding:కేఎల్ రాహుల్ - అతియాల ఫొటోలు
- Advertisment -

Kl Rahul-Athiya Wedding:కేఎల్ రాహుల్ – అతియాల ఫొటోలు

- Advertisment -
- Advertisment -
  • ఖండాలాలోని సునీల్‌శెట్టి ఫామ్‌హౌస్‌లో జ‌రిగిన వివాహం

ఇండియన్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ – బాలీవుడ్ స్టార్ కిడ్ అతియాల పెళ్లి సోమవారం (Monday) ఘనంగా జరిగింది. చిర‌కాల ప్రియురాలు మెడ‌లో ఆనందంగా మూడుముళ్లు వేశాడు రాహుల్. ఖండాలాలోని సునీల్‌శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌ (Sunil Shetty’s farmhouse in Khandala)లో నిరాడంబ‌రంగా జ‌రిగిన వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు (Photos) నెట్టింట తెగ వైరల్ (viral)అవుతున్నాయి.

ఈ మేరకు సంతోషంగా దాంప జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జోడి తమ శుభకార్యానికి సంబంధించి విశేషాలు అభిమానులతో పంచుకున్నారు. భార్యాభ‌ర్తలుగా మారిన త‌ర్వాత తొలి ఫొటోను రాహుల్‌, అతియాశెట్టి త‌మ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. నీ హృద‌య కాంతిలో ప్రేమించ‌డం నేర్చుకున్నా అంటూ ఎమోష‌న‌ల్‌గా పెళ్లి ఫొటోను ఉద్దేశించి అతియాశెట్టి వ్యాఖ్యానించింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం అంతులేని ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని పేర్కొన్నది. ఈ శుభ‌సంద‌ర్భంలో అంద‌రి దీవెన‌లు కోరుకుంటున్నామంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. రాహుల్ అతియాశెట్టి పెళ్లికి ఇరు కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొంత మంది అతిథులు మాత్రమే హాజ‌ర‌య్యారు. ప్రస్తుతం న్యూజిలాండ్ (New Zealand) సిరీస్‌తో బిజీగా ఉండ‌టంతో టీమ్ ఇండియా క్రికెట‌ర్స్ ఎవ‌రూ రాహుల్ వివాహానికి హాజ‌రుకాలేక‌పోయారు. త్వర‌లోనే క్రికెట‌ర్స్‌, బాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటుచేసే అవ‌కాశం ఉన్నట్లు స‌మాచారం. ఈ వివాహా వేడుకకు కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మీడియాతో మాట్లాడిన సునీల్‌ శెట్టి (Sunil shetty)తమ కూతురు వివాహం వైభవంగా జరిగినట్లు తెలిపారు.

https://www.instagram.com/p/CnwtWxgKsK9/?utm_source=ig_web_copy_link

(Sudheer babu:కృష్ణగారు ఇచ్చిన ధైర్యంతోనే ‘హంట్’ చేశా)

ఇక సునీల్‌ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి (Ahan Shetty) కొందరు మీడియా ప్రతినిధులకు స్వీట్లు పంచారు. వివాహ వేదిక స్థలానికి మీడియాను అనుమతించలేదు. అయితే వివాహ వేడుక బయట మీడియాతో ముచ్చటించిన సునీల్‌ శెట్టి మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలపడంతో పాటు స్వీట్లు పంచారు. పెళ్లి అధికారికంగా జరిగిపోయింది కాబట్టి తాను అధికారికంగా మామయ్యను అయిపోయానని సునీల్‌ శెట్టి చెప్పుకొచ్చారు. అయితే కొత్త జంట మాత్రం మీడియా ముందుకు రాలేదు. ఇదిలా ఉంటే వివాహం జరిగిన కాసేపటికే కొత్త పెళ్లి కూతురు అతియా శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనల్ పోస్ట్‌ చేశారు. రాహుల్‌తో ఏడడుగులు వేసిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్న అతియా.. ‘నీ సాన్నిహిత్యంలోనే ఎలా ప్రేమించాలో తెలుసుకున్నాను. ఈరోజు నేను ఎంతగానే ఇష్టపడే వ్యక్తితో నా వివాహం జరిగింది. ఇది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదాలు కోరుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ వేడుకపై స్పందిస్తున్న పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

https://www.instagram.com/p/CnwtWxgKsK9/?utm_source=ig_web_copy_link

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -