end
=
Tuesday, January 21, 2025
వార్తలుజాతీయంస్వమిత్వా స్కీమ్ లాంచ్ చేయనున్న మోదీ..
- Advertisment -

స్వమిత్వా స్కీమ్ లాంచ్ చేయనున్న మోదీ..

- Advertisment -
- Advertisment -

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. అలాంటి వారికీ అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక తాజాగా ప్రధాని మోదీ సరికొత్త స్కీమ్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా గ్రామాల్లో నివసిస్తున్న వారికి భూ యాజమాన్య పత్రాలను అందించనున్నారు. డ్రోన్స్ ద్వారానే ప్రాపర్టీ డాక్యుమెంట్ల పంపిణీ జరుగనుంది. ఆదివారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. అయితే భూ వివాదాలకు స్వస్తిపలకడం, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ప్రాపర్టీ హక్కు కల్పించడం వంటివి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం అని అధికారులు తెలిపారు.

ఆకాశానికి చిల్లు పడింది..

అయితే దేశవ్యాప్తంగా 763 గ్రామాల్లో ఉన్నాయని తెలిపారు. దేశంలో దాదాపు 1,32,000 మందికి ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్లు అందనున్నాయన్నారు. ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్లను తనఖా పెట్టి రుణాలు పొందొచ్చునన్నారు. అంటే ఇళ్లపై కూడా లోన్ తీసుకోవచ్చు. దీంతో చాలా మందికి ఆర్థిక తోడ్పాటు లభించనుంది. స్వమిత్వా స్కీమ్ కింద ప్రధాని మోదీ ప్రాపర్టీ డాక్యుమెంట్లను అందించనున్నారని తెలిపారు.

ఇక హరియాణాలోని 221 గ్రామాలు, మహరాష్ట్రలో 100 గ్రామాల్లో, ఉత్తర ప్రదేశ్‌లో 346 గ్రామాల్లో, ఉత్తరఖండ్‌లో 50 గ్రామాల్లో, మధ్యప్రదేశ్‌లో 44 గ్రామాల్లో, కర్నాటకలో 2 గ్రామాల్లో డాక్యుమెంట్ల పంపిణీ జరగనుంది అని తెలిపారు. ఇక వీరందరికీ డిజిటల్ ప్రాపర్టీ కార్డులు కూడా లభిస్తాయని తెలిపారు. మన తెలుగు రాష్ట్రాలు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం అని అంటున్నారు అధికారులు.
అంతేకాదు లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు ఒక ఎస్ఎంఎస్ వస్తుందని తెలిపారు.

ఇందులో లింక్ ఉంటుందన్నారు. దీనిపై క్లిక్ చేసి డిజిటల్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చునన్నారు. ఇకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు ఈ పథకం ద్వారా డిజిటల్ కార్డులను లాంచ్ చేయనున్నారని తెలిపారు. తర్వాత లబ్ధిదారులకు ఈ డిజిటల్ కార్డులు లభిస్తాయనిఅధికారులు వెల్లడించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -