మోదీ సింగిల్ ఫోటో ఫ్లెక్సీలు.. అసహనంలో జేడీయూ
బాహుబలి సినిమాలో బళ్లాలదేవుడిగా అద్భుత నటనతో ఆకట్టుకున్న స్టార్ రానా. ఈ సినిమాతో రానా మరో రేంజ్‌లోకి వెళ్లాడు. విభిన్న భాషా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయ్యారు. కాగా, రానా.. బాహుబలి కంటే ముందే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదుః సుప్రీమ్ హీరో
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు ప్రభాస్, రానా. కానీ, లాక్‌డౌన్ పీరియడ్‌లో రానా తను ప్రేమించిన మహికా బజాజ్‌ను ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకొని బ్యాచ్‌లర్ లైఫ్‌కి శుభం కార్డు వేశాడు. రానా తన ప్రేమ గురించి బయటి జనాలకు తెలిసిన కొద్ది రోజులకే వివాహం చేసుకోవడం గమనర్హం.కాగా, రానా.. పెళ్లయిన తర్వాత వచ్చిన అతి పెద్ద పండుగ దసరాను తన అత్త వారింట్లో సందడిగా జరుపుకున్నాడు.
సెంచరీతో చెలరేగిన స్టోక్స్.. RR ఘనవిజయం
ఈ విషయాన్ని స్వయంగా రానా అత్తయ్య బంటి బజాజ్ సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసి, ఈ విషయాన్ని తెలియజేశారు. రానా భార్య మహికా.. అత్తమామలతో ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సాంఘిక మాధ్యమాల్లో ఫుల్ అల్‌చల్ చేస్తోంది. రానా సెలెక్షన్ సూపర్ అంటూ అభిమానులు ఆయన్ని తెగ పొగిడేస్తున్నారు. వాళ్లన్నట్లుగానే రానా, మహికా జంట చూడముచ్చటగా ఉంది.