end
=
Tuesday, December 23, 2025
వార్తలుజాతీయంబిహార్‌లో ఎన్డీయే పాలనపై శశి థరూర్ ప్రశంసలు
- Advertisment -

బిహార్‌లో ఎన్డీయే పాలనపై శశి థరూర్ ప్రశంసలు

- Advertisment -
- Advertisment -

Bihar: మౌలిక వసతులు, శాంతిభద్రతల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(bjp)పై ప్రశంసలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్(Shashi Tharoor) మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశారు. తాజాగా బిహార్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన బహిరంగంగా ప్రశంసించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిహార్‌ వెళ్లిన థరూర్, అక్కడి పర్యటన సందర్భంగా ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. గతంలో బిహార్‌ గురించి తాను విన్న అభిప్రాయాలతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారినట్లు అనిపిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల పరంగా రాష్ట్రం గణనీయంగా ముందుకు వెళ్లిందన్నారు. రోడ్లు మెరుగ్గా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని థరూర్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు, గతంలో అరుదుగా కనిపించిన దృశ్యాలు ఇప్పుడు సాధారణమయ్యాయని తెలిపారు. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ప్రజలు నిశ్చింతగా వీధుల్లో సంచరిస్తున్నారని, ఇది శాంతి భద్రతలు ఎంతగా మెరుగుపడ్డాయో సూచిస్తుందని చెప్పారు. విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో బిహార్‌లో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని, ఇవన్నీ పాలనా వ్యవస్థలో వచ్చిన మెరుగుదల ఫలితమేనని థరూర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురించి ప్రశ్నించగా, తాను అక్కడి రాజకీయాల్లోకి లాగబడాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజకీయ వ్యాఖ్యలకంటే అభివృద్ధి అంశాలపైనే మాట్లాడాలనుకుంటున్నానని, రాష్ట్రంలో జరిగిన పురోగతిని చూసి సంతోషంగా ఉందని అన్నారు.

థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. అయితే, ఇది మొదటిసారి కాదు. ఇటీవల కాలంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా ప్రశంసలు కురిపించారు. ఈ కారణంగా స్వపక్ష నేతల నుంచే ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నప్పటికీ, థరూర్ వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీ అధికారిక వైఖరికి భిన్నంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. బిహార్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయనను వార్తల కేంద్రంగా నిలిపాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -