end
=
Wednesday, May 15, 2024
బిజినెస్‌LPG Cylinder: భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర..
- Advertisment -

LPG Cylinder: భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర..

- Advertisment -
- Advertisment -

LPG Cylinder Price Drop: వినియోగదారులకు(Users) భారీ ఊరట ఇచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్(Commercial Gas Cylinder) ధరలను కంపెనీలు అత్యధిక స్థాయిలో తగ్గించి కొత్త నెల ప్రారంభంలోనే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ తగ్గింపుతో అన్ని నగరాలలో ఈ రేట్లు దిగొచ్చాయి. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రేట్లను తగ్గించడం ఇది ఐదోసారి. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను తగ్గించిన కంపెనీలు గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్ ధరలను తగ్గించలేదు.

కమర్షియల్ పరంగా వాడే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. రిపోర్టుల ప్రకారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ కోసం వాడే 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఈ రోజు నుండి రూ.91.50 తగ్గించినట్టు తెలిపారు. ధరల తగ్గింపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,885గా ఉంది. ఈ సిలిండర్ ధర మే నెలలో ఆల్‌టైమ్ రికార్డు గా రూ.2,354 ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీతో పాటు ఇతర మెట్రో నగరాల్లో(Metro cities) కూడా ఈ కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి.హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,099.5గా ఉంది. ఏపీలోని విజయవాడలో ఈ రేటు రూ.2034. ఇక కోల్‌కతాలో ఈ రేటు రూ.2,095.50 నుంచి రూ.1,995.50కు తగ్గింది. అదేవిధంగా ముంబైలో కూడా ఎల్‌పీజీ సిలిండర్ రేటు రూ.1,936.50 నుంచి రూ.1,844కు దిగింది.

చెన్నైలో ఇంతకముందు ఈ 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,141. కానీ ప్రస్తుతం ఈ ధర రూ.2,045. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు భారీగా తగ్గగా.. గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మాత్రంతగ్గించలేదు. మే 19, 2022న ఈ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,354 పలికి అత్యంత గరిష్ట స్థాయికి పెరిగింది. ఆ తర్వాత నెలల్లో ఈ సిలిండర్ ధరను కంపెనీలు తగ్గిస్తూ వస్తున్నాయి.ప్రస్తుతం తగ్గించిన ధరలతో.. రెస్టారెంట్లు, బేకరీలు, టీ స్టాల్స్ వంటి వాటికి భారీ ఊరట లభిస్తుంది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌ను ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాయి. నెలలో రెండుసార్లు ఆయిల్ కంపెనీలు(Oil marketing companies) ఈ ఎల్‌పీజీ ధరలను మారుస్తూ ఉంటాయి.

(మళ్లీ పెట్రో మంట, ఆగని ధరలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -