end
=
Saturday, June 1, 2024
వార్తలుజాతీయంఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి..
- Advertisment -

ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి..

- Advertisment -
- Advertisment -

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఆర్మీ క్యాంప్‌పై గురువారం ఉదయం ఆత్మహుతి దాడి జరిగింది.గురువారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపులో చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన సెంట్రీ కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా కాల్పుల్లో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు..ఇద్దరికి గాయాలయ్యాయి. జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ జిల్లాలోని పార్గల్ ఆర్మీ క్యాంప్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దేశ ప్రజలంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న వేళ ఉగ్రమూకలు దేశంలోకి ప్రవేశించి పేలుళ్లకు ప్రయత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో జమ్మూకాశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేశాయి.ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతం మొత్తాన్ని ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో.. వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు.

ఈ ప్రదేశం దర్హల్ పోలీసు స్టేషన్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉందని జమ్మూ జోన్ అడిషనల్ డీఐజీ ముకేశ్ సింగ్ తెలిపారు.ఇద్దరు ఉగ్రవాదులు రాజౌరీలోని పార్గల్ వద్ద ఆర్మీ పోస్టులోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సైన్యం వారిని మట్టుబెట్టింది. ఐదుగురు సైనికులకు సైతం గాయాలయ్యాయని ఆర్మీకి చెందిన 16 కార్ప్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వేకువ జామున 3.30 గంటలకు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి ప్రయత్నించగా… ఆర్మీ దాన్ని విఫలం చేసిందని సైనికాధికారులు తెలిపారు. ఈ దాడి చేసింది లష్కరే తొయిబా ఉగ్రవాదులని భావిస్తున్నారు. ఘటనా ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. అదనపు బలగాలను మోహరించామని వెల్లడించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -