కరోనా దెబ్బకు సీనీమా ఇండస్ర్టీ దెబ్బతిని దాదాపు రెండు సంతవ్సరాలు కావొస్తుంది. కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన సినిమాలు థియేటర్లలో విడుదల చేయలేని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీమాను థియేటర్లలో విడుదల చేస్తే ప్రేక్షకులు వస్తారో లేదో అనే భయం నిర్మాతలలో ఉంది. అందుకే విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం తమిళ రీమేక్ నారప్ప సినీమాను ఓటీటీ (అమెజాన్ ప్రైమ్)లో జూలై 24న విడుదల చేయబోతునట్లు సినీమా పోస్టర్లు విడుదల చేశారు. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అసురన్ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో ధనుష్ పోషించిన పాత్రను తెలుగులో వెంకటేశ్ చేశాడు. నారప్ప సినీమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్యగా ప్రియమణి నటించింది.