end
=
Tuesday, March 25, 2025
Sample Page
- Advertisment -

Sample Page Title

- Advertisment -
- Advertisment -

అమెరికా అధ్యక్ష పీఠాన్ని తాను ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నొక్కి చెప్పారు. అవసరమైతే.. ఎంతవరకైనా పోరాడతానని వెల్లడించారు. జార్జియాలో మంగళవారం జరగనున్న రన్నాఫ్‌ ఎన్నిక నేపథ్యంలో సోమవారం రాత్రి తన మద్దతు దారులు నిర్వహించిన భారీ ర్యాలీలో ట్రంప్‌ మాట్లాడారు. ఎవరూ వైట్‌ హౌస్‌లోకి అడుగు పెట్టలేరని, తాను అధ్యక్ష పీఠాన్ని వదిలి పెట్టేది లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, లేకపోతే.. తానే భారీ మెజారిటీతో గెలిచేవాడినని అన్నారు. అదేసమయంలో తన ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్‌ చట్టసభల సభ్యులు మౌనం పాటించాలని సూచించారు.

అంతేకాదు, బుధవారం జరగనున్న చట్టసభల సంయుక్త సమావేశంలో బైడెన్‌ ఫలితాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని రిపబ్లికన్‌ సభ్యులకు పిలుపునిచ్చారు. అలాగే, అధ్యక్ష భవనం వద్ద భారీ ర్యాలీ నిర్వహించాలని తన మద్దతుదారులకు సూచించారు. ‘నేను మీకు హామీ ఇస్తున్నా. బుధవారం మనదే. చట్టసభలో మనకు అంతా అనుకూలంగానే జరుగుతుంది’ అని ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, అధ్యక్ష ఎన్నికలను రద్దు చేసేలా ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ట్రంప్‌కు మద్దతు పలుకుతుండగా, మరికొందరు ప్రస్తుత, మాజీ సభ్యులు మాత్రం.. ఇది అమెరికన్ల విశ్వాసాన్ని తక్కువగా అంచనావేయడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితంగా రిపబ్లికన్లు రెండుగా చీలుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -